Thursday, May 23, 2024

సలహా ఇవ్వడం ఈజీ.. అనుభవిస్తే బాధ తెలుస్తుంది.. రేణుదేశాయ్

ప‌లువురు ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్ అభిమానులు న‌టి రేణు దేశాయ్ కి ఓ సలహా ఇచ్చారు. పవన్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ పవన్ అభిమానుల మాదిరి మీకు తప్పుడు సందేశాలు పంపవచ్చు. కాబట్టి మీరు ఇంస్టాగ్రామ్ అకౌంట్ సెట్టింగ్స్ మార్చుకోండి. కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేయమని సూచించారు. పవన్ అభిమానుల సలహాలను రేణు దేశాయ్ తప్పుబట్టారు. సమాజంతో ఇదే ప్రాబ్లమ్. ఎవరి కోసమో నేను మారాలా..మీరు చెప్పినట్లు జీవించడానికి నేను ఏమి తప్పు చేశాను సలహా ఇవ్వడం చాలా ఈజీ. బాధ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది.. అని కామెంట్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన సంభాషణ వైరల్ అవుతుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ అభిమానులు ప‌లుమార్లు రేణు దేశాయ్ కి స‌ల‌హాలు ఇస్తూ ఆమెకి త‌ల‌నొప్పిగా మారుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement