Saturday, June 15, 2024

TS : శానీటరీ వర్కర్స్ కి లైంగిక వేధింపులు.. కామ పిశాచి సస్పెండ్

జీహెచ్ఎంసీ సర్కిల్ లో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ కీచక పర్వంపై నగర పాలక సంస్థ కమిషనర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. . తన కింద పనిచేసే కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా అదంతా వీడియోలు, పోటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహిళ సిబ్బంది కమిషనర్ దృష్టికి తెచ్చారు.. అంతే కాకుండా . ఈ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రస్‌ స్పందించారు. కిషన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకెళ్తే..కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అదే సర్కిల్‌లో పని చేసే ఓ పారిశుద్ధ్య మ‌హిళా కార్మికుల‌పై కన్నేసాడు. అధికార దర్పంతో అఘాయిత్యానికి పాల్పడే దుస్సాహసానికి వడిగట్టాడు. తాను చెప్పినట్లు వినాలని హుకూం జారీ చేశాడు.
ఆఖరికి అతడి మాట వినకపోతే.. విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం వంటి దురాగతాలకు పాల్పడేవాడు. దీంతో బాధితులు కీచక కిషన్ వేధింపులకు తట్టుకోలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవించేవారు.. పైగా వాటన్నింటిని ఫోన్‌లో రికార్డ్ చేసేవాడు . ఏం జరిగిందో కానీ.. కిషన్ వీడియోలు బయటకు రావడం సహ ఉద్యోగుల వరకు చేరిపోవడం జరిగింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అతడిపై చర్యలు తీసుకోవాలని సహోద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement