Tuesday, May 28, 2024

Prabhas : బుజ్జితో ప్ర‌భాస్….అదిరింది డార్లింగ్

ప్రభాస్.. ఈ పేరు వినగానే గూస్ బంప్స్ పక్కాగా రావాల్సిందే. ఆ పేరుకు అంతటి క్రేజ్ ఉంది మరి. సినిమా ఏదైనా, క్యారెక్టర్ ఎలాంటిదైనా తన మార్క్ అక్కడ ఉండాల్సిందే. ఈ పేరు ఎక్కడ విన్నా అభిమానుల గుండెల్లో గంట మోగాల్సిందే. మరి అంతటి స్టార్ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే ఎలా ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.

‘కల్కి 2898 ఏడీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఎంతో గ్రాండ్ లెవెల్లో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందింది. ఇందులో ప్రభాస్ లుక్‌కి యావత్ సినీ ప్రపంచమే ఫిదా అయిపోయింది. హాలీవుడ్ రేంజ్ మార్వెల్స్ హీరోలా కనిపించిన ప్రభాస్ అందరి మనస్సులు దోచుకున్నాడు. నిజంగా ప్రభాస్‌ను ఇప్పటి వరకు అలాంటి లుక్‌లో ఎన్నడూ.. ఏ సినిమాలోనూ చూసుండరు.

- Advertisement -

దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ప్రభాస్ అభిమానులు థాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే తాజాగా ఈ మూవీ ఈవెంట్‌ను గ‌త రాత్రి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో ప్రభాస్ నడిపే వాహనాన్ని లాంచ్ చేశారు. అయితే ఆ వాహనానికి బుజ్జి అనే పేరును కూడా పెట్టారండోయ్. అందుకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అందులో ప్రభాస్ ఏమన్నా ఉన్నాడా.. అబ్బో అదిరిపోయాడంతే.

ఈ ఈవెంట్‌లో ప్రభాస్ ఆ వెహికల్‌ని తానే స్వయంగా నడుపుకుంటూ గ్రౌండ్‌లో చక్కర్లు కొట్టాడు. అనంతరం ఒక క్రేన్‌పై ప్రభాస్ ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉంది. ఫుల్‌గా హంగామా.. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌తో టపాసులు ఇలా మొత్తం అదిరిపోయింది. ఇక ఈ ఈవెంట్‌లో ప్రభాస్ తన మాటలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాడు.

‘‘హాయ్ డార్లింగ్స్.. బుజ్జి – భైరవ గ్లింప్స్ ఎలా ఉంది. ఎంజాయ్ చేశారా. అంటే ఈ ఈవెంట్‌కి తక్కువ మందిని తీసుకురావడానికి.. ఇలా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మీ సేఫ్టీ కోసమే.. అందరికీ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము.
ముఖ్యంగా చెప్పాలంటే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే కమల్ హాసన్‌కు వంద దండాలు సార్. చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసిన నేను అచ్చం కమల్ హాసన్ వేసుకున్న బట్టలు కావాలని మా అమ్మని అడిగాను. అలాంటి నేను ఇప్పుడు ఆయనతో నటించడం అంటే మామూలు విషయం కాదు. థాంక్యూ కమల్ సార్’’ అంటూ మరిన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement