Friday, July 26, 2024

MBNR | అక్రమ మట్టి రవాణా.. పట్టించుకోని అధికారులు

అచ్చంపేట, (ప్రభ న్యూస్) : అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం, గోదల గ్రామంలోని రామేశ్వరం చెరువులో ధనార్జనే ధ్యేయంగా కొందరు నాయకులు అనుమతులు లేకుండా చెరువులో నుండి అక్రమంగా విలువైన మొరం మట్టిని త్రవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మంగళవారం తాసిల్దార్ శైలేష్, అచ్చంపేట ఆర్డీవో మాధవికి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదును అందుకున్న అధికారుల కళ్ళముందే అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్న చూసి చూడనట్లుగా వ్యవహరించడంలో మతలబు ఏంటో అర్థం కావడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం ఒక్క రోజులోనే చెరువు నుండి దాదాపు 150 ట్రాక్టర్ల మోరాన్ని తరలించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వ్యాపారస్తులు వారికి నచ్చిన చోట ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో ఎక్కడపడితే అక్కడ తెల్ల మట్టిని తోడేస్తున్న తీరును చూస్తుంటే భవిష్యత్తులో చెరువు కట్టకు ప్రమాదం పొంచి ఉండని గ్రామస్తులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే చెరువు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement