Contact

అత్యుత్తమ ప్రమాణాలతో బహుళ జనాదరణ పొందిన వివిధ అనుబంధాలు:

‘ఆంధ్రప్రభ’ ప్రధాన స్రవంతి వార్తలతో పాటు వివిధ వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ వివిధ ప్రత్యేక అనుబంధాలను కూడా ప్రచురిస్తోంది. పాఠకాదరణ పొందిన విభిన్న సామాజిక కోణాల లైఫ్, మహిళా వేదిక ‘నాయిక’, ఆధ్యాత్మిక విశేషాల ‘చింతన’, సాంస్కృతిక అంశాలతో కూడిన ‘సంస్కృతి’, బాలల కోసం విజ్ఞానవినోదాలు పంచే ‘బాలప్రభ’, వైద్యఆరోగ్యాలపై విస్తృత సమాచారం అందించే ‘కులాసా’, వైవిధ్యంతో అలరారే ‘ఆదివారం ఆంధ్రప్రభ’, సినీవిశేషాల కదంబం ‘చిత్రప్రభ’, విద్యార్థుల, ఉద్యోగార్థుల కరదీపిక ‘విద్యాప్రభ’, విపణి తీరుతెన్నులను వివరించే ‘సిరిగమలు’ వంటివి ‘ఆంధ్రప్రభ’కు ప్రత్యేకాకర్షణలుగా నిలుస్తాయి. రోజూ ప్రచురించే సినీవార్తావిశేషాల ప్రత్యేక పేజీ ‘షో’, వ్యాపార, వాణిజ్య పరిణామాలను తెలిపే ‘బిజినెస్’ పేజీ వంటివి కూడా ‘ఆంధ్రప్రభ’కు అదనపు హంగులుగా సమకూరాయి.

Andhraprabha Telugu Daily
8-2-293/82/A/75, Plot No.75,
Road No.9, Jubilee Hills, Hyderabad-500033

(040) 2355-9940
(040) 2355-9941
(040) 2355-9942

Email: [email protected]

ఆంధ్రప్రభకు ఊపిరి పోసింది స్వర్గీయ రామ్ నాథ్ జీ గోయెంకా అయితే కొత్త జవసత్త్వాలను నింపింది మాజీ మంత్రి, ప్రస్తుత ప్రధాన సంపాదకులు శ్రీ ముత్తా గోపాలకృష్ణ . కొత్త సొబగులతో దానిని యువతరానికి చేరువ చేసేందుకు విద్యాధికులైన ‘ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ లిమిటెడ్’ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముత్తా గౌతమ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. ఇలా ప్రస్తుత యాజమాన్యం ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రభ’ ఉభయ రాష్ట్రాలలోని తెలుగువారి అభ్యుదయానికి పునరంకితం అవుతోంది.