Saturday, July 27, 2024

TG | జూన్ 10 వ‌ర‌కు జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంప్స్ పోడిగింపు..

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాల(సమ్మర్ క్యాంప్స్) సమయాన్ని పొడిగిస్తూ బల్దియా నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 10 వరకు నగరంలో సమ్మర్ క్యాంప్స్​ను కొనసాగించాలని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు.

వాస్తవానికి మే 31తోనే ఇవి ముగియాల్సి ఉండగా మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. సంబంధిత జోనల్ కమిషనర్లు ఈ విషయాన్ని గ్రహించి వేసవి శిక్షణ శిబిరాల్లో అన్ని ఆటలు, ఈవెంట్లను కొనసాగించాలని సూచించారు. అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు కూడా అందజేయాలని ఆదేశించారు. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా జీహెచ్ఎంసీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో366 ప్రాంతాల్లో 44 క్రీడల్లో సమ్మర్ క్యాంప్స్​ను నిర్వహిస్తున్నారు. మొత్తం 37 రోజులపాటు శిక్షణ ఖరారు చేయగా మరో 10 రోజులపాటు శిబిరాలు కొనసాగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement