Friday, July 26, 2024

Simba : సింబా … టైటిల్ భ‌లే ఉందే…

ఒకప్పుడు హీరోగా వైభవం చూసిన జగపతి బాబు.. చాలా ఏళ్ల నుంచి విలన్, క్యారెక్టర్ రోల్సే చేస్తున్నారు. ఇప్పుడాయన లీడ్ రోల్‌లో ఒక సినిమా తెరకెక్కుతుండడం విశేషం. అందులో అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్ర పోషిస్తోంది.
ఆ చిత్రం పేరు.. సింబా.

- Advertisement -

ఓవైపు దర్శకుడిగా సినిమాలు తీస్తూనే మరోవైపు ప్రొడక్షన్లోనూ బిజీగా ఉంటున్న సంపత్ నంది ఈ చిత్రాన్ని దాసరి రాజేందర్ రెడ్డి అనే మరో నిర్మాతతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మురళీ మనోహర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అనీష్ కురువిల్లా, దివి, కబీర్ సింగ్ దుల్హాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

‘సింబా’కు ది ఫారెస్ట్ మ్యాన్ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఒక చెట్టు బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ప్రకృతి కోసం పాటుపడే ఒక వ్యక్తి కథలా అనిపిస్తోంది క్యాప్షన్, ఫస్ట్ లుక్ చూస్తుంటే. ఉదాత్తమైన కథాంశంతో తెరకెక్కిన సినిమాలా కనిపిస్తున్న ఇలాంటి చిత్రాన్ని ఈ రోజుల్లో రూపొందించడం ఆశ్చర్యమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement