Friday, June 7, 2024

Sumit Nagal : వింబుల్డ‌న్ మెయిన్ డ్రాలో నగాల్ ….

భారత నెం.1 టెన్నిస్‌ ప్లేయర్‌ సుమిత్‌ నగాల్‌ మరో ఘనత సాధించాడు. గత కొంత కాలంగా చిరస్మరణీయ ప్రదర్శ నలతో ఆకట్టుకుంటున్న భారత స్టార్‌ సుమి త్‌ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్‌ గ్లాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించి సంచలనం సృష్టించాడు.

పురు షుల సింగిల్స్‌ మెయిన్‌ డ్రాకు నగాల్‌ తొలి సారి క్వాలిఫై అయ్యాడు. గత ఐదేండ్లలో ఈ మెగా గ్రాండ్‌స్లామ్‌కు అర్హత సాధించిన తొలి భారత టెన్నిస్‌ ప్లేయర్‌గా కూడా సుమిత్‌ రికార్డుల్లో నిలిచాడు. 2019లో ప్రజ్నేష్‌ గుణశ్వరణ్‌ వింబుల్డన్‌ మెయిన్‌ డ్రాకు క్వాలిఫై అయ్యాడు. ఆ టోర్నీలో ప్రజ్నేష్‌ 6-7, 6-2, 2-6 తేడాతో కెనడాకు చెందిన మిలొస్‌ రౌనిక్‌ చేతిలో పోరాడి ఓడాడు. ఇప్పుడు దాదాపు ఐదేళ్ల తర్వాత సుమిత్‌ నగాల్‌ ఈ ఘనత సాధిం చాడు. ఇక ఈ ఏడాది జరిగే వింబుల్డన్‌ టోర్నీ జులై 1 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement