Wednesday, May 29, 2024

Tollywood : హేమకు డ్రగ్స్​ టెస్టు ….పాజిటివ్ గా నిర్ధారణ

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ ప్ర‌తినిధి: సినీ నటి హేమతో సహా ఏపీకి చెందిన 86 మంది ప్రముఖులు మత్తు వలకు చిక్కినట్టు కన్నడ పోలీసులు ఆధారాలతో సహా బ‌య‌ట‌పెట్టారు. అబ్బే.. రేవ్ పార్టీనా.. అంటూ ఆశ్చర్యం ప్రకటించిన సినీ నటి హేమ విషయంలో తెలుగు సినీ ప్రపంచం నివ్వెర‌పోతోంది. రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు వెల్లడించిన విషయాల ప్రకారం.. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్ బృందం గుర్తించింది. అందులో నటి హేమ కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు యాంటీ నార్కోటిక్స్‌ టీమ్ నివేదికను సమర్పించింది.

ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను అధికారులు సేక‌రించారు. ఇందులో 57 మంది మ‌గాళ్లు, 27 మంది ఆడాళ్ల‌ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. అంటే మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అయితే.. హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించి కౌన్సెలింగ్ నిర్వహించటానికి అధికారులు రెడీ అయ్యారు.

- Advertisement -

కృష్ణవేణి పేరుతో వెళ్లిన హేమ‌..

తన పేరు బయటికి రాకుండా సినీనటి హేమ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది, ఆమె తన‌ పేరు మార్చుకొని.. కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైనట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీకి సినీ నటి హేమ అటెండ్‌ అయ్యారంటూ తొలుత కన్నడ మీడియా ప్ర‌చారం చేసింది. ఆ పార్టీకి తాను వెళ్లనే వెళ్లలేదు అని హేమ చెప్పుకొచ్చారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఓ ఫామ్‌హౌస్‌లో చిల్‌ అవుతున్నానని చెప్పారు. అంతేకాకుండా ఫేక్‌ న్యూస్‌ నమ్మొద్దండి అంటూ నవ్వుతూ చెప్పారు. తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు.

ఆ ఫొటో, ఈ వీడియోలో డ్రెస్.. సేమ్ టు సేమ్‌

అయితే.. హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. రేవ్‌ పార్టీకి తాను వెళ్లలేద‌ని హేమ కూడా వీడియోలో ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రెస్‌లో కనిపించారు. డ్రెస్‌ మ్యాచ్ అయ్యింది. హేమ మాటలు తూచ్‌ అయ్యాయి. చివరకు ఆమె ఆ పార్టీలో పాల్గొందని బెంగళూరు కమిషనరే క‌న్‌ఫామ్‌ చేశారు. ఆ తర్వాత రోజు హైదరాబాద్ వచ్చిన హేమ.. బిర్యానీ వండుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నార్కోటిక్ టెస్టులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement