Thursday, July 25, 2024

PAN-Aadhaar అనుసంధానం.. మే 31 తుది గడువు

పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు ఇప్పటికే ముగిసింది. మే31 వరకు 1000 రూపాయల ఫైన్‌తో పాన్‌-ఆధార్‌ కార్డును అనుసందానం చేసుకోవచ్చు. ఇలా అనుసంధానం చేయకుంటే 2024 మార్చి 31కి ముందు చేసిన పన్ను లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత (టీడీఎస్‌), పన్ను చెల్లింపులు ఉంటాయని ఆధాయ పన్ను శాఖ తెలిపింది.

టీడీఎస్‌, టీసీఎస్‌ చెల్లింపులు గవేసినట్లుగా కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే నోటీస్‌లు అందుకున్నారని తెలిపింది. పాన్‌-ఆధార్‌ కార్డు అనుసంధానం చేయకపోవడం మూలంగా పాన్‌ కార్డు నిరుపయోగంగా మారడమే ఇందుకు కారణమని పేర్కొంది. అధిక రేటు వద్ద పన్ను కోత, చెల్లింపు చేయకపోవడం వల్ల నోటీస్‌లు అందాయని తెలిపింది.

వారందరికీ మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఆ లోపుగా పాన్‌ కార్డును ఇలాంటి వారు యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న వారికి అదనపు పన్ను భారం ఉం డదని ఆదాయ పన్ను శాఖ తెలిపింది.

ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చాలా కాలంగా కోరుతోంది. ఇప్పటికే అత్యధికులు దీన్ని పూర్తి చేశారు. పాన్‌-ఆధార్‌ కార్డు అనుసంధానం అయ్యింది లేనిది తెలుసుకునేందుకు ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చేక్‌ చేసుకోవచ్చు. ఇందులో లింక్‌ ఆధార్‌ స్టేటస్‌ పై క్లిక్‌ చేస్తే మీ ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్‌ అయ్యిందీ లేనిదీ తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement