Monday, June 24, 2024

నేటి రాశిఫ‌లాలు(29-05-2024)

మేషం : అకాల భోజనాదులవల్ల అనారోగ్య మేర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టు-దలతో ఉండడం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.

వృషభం : మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండుట మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటు-ంది. స్థిరాస్తులకు సంబంధించి విషయాల్లో జాగ్రత్త అవసరం.

మిథునం : గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయ, ప్రయాసలుంటాయి. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళనతో కాలం గడుపాల్సి వస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటకం : కళాకారులకు, మీడియారంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటు-ంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటు-ంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు పొందుతారు.

సింహం : ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే, ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.

- Advertisement -

కన్య : ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటు-ంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశం ఉంది.

తుల : కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.

వృశ్చికం: స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశాముంటు-ంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశ్రుభతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్యబాధలుండవు.

ధనస్సు: మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగివుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులకు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.

మకరం: విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటు-ంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలన మేర్పడే అవకాశాలుంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్త ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలుంటాయి.

కుంభం : అపకీర్తి రాకుండా జాగ్రత్తపడడం మంచిది. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడం ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.

మీనం : ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement