Monday, June 10, 2024

AP : రాజ‌కీయ ప్ర‌తినిధుల‌తో ఎస్పీ స‌మావేశం

ఏలూరు జిల్లాలోని రాజ‌కీయ ప్ర‌తినిధుల‌తో ఎస్పీ మేరీ ప్ర‌శాంతి గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. జూన్‌4న నిర్వ‌హించే కౌంటింగ్ సంద‌ర్భంగా ప్ర‌జాశాంతికి భంగం క‌ల‌గ‌కుండా ఉండేలాగా స‌మావేశాన్ని నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 6 వరకు ఏలూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు అని జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ లు అమల్లో ఉన్నందున ప్రజలు నలుగురికి మించి ఒకచోట గుంపుగా ఉండరాదన్నారు.

- Advertisement -

కౌంటింగ్ రోజు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి గొడవలకు కారకులై క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవద్దని , రెచ్చగొట్టే చర్యలు, ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని అన్ని రాజకీయ పార్టీల వారు శాంతియుతంగా ఉండాలని ముందస్తుగా అనుమతులు లేకుండా ఊరేగింపులు, ర్యాలీలు చేయరాదని తెలిపారు. జూన్ 6 వరకు నమోదయ్యే క్రిమినల్ కేసులన్నిటిని ప్రత్యేకంగా పరిగణించి ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో సదరు కేసులు అన్నిటిలో శిక్ష పడే విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏలూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించుటకు రాజకీయ పార్టీ నాయకులు మరియు ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు పోలీసులకు అందించుటవలన ప్రశాంతమైన వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుకున్నట్లు అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కొరకు ఏ విధముగా సహాయ సహకారాలు అందించారు.

అదే సహాయ సహకారాలను అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి స్వరూపారాణి, ఎస్.బి ఇన్ స్పెక్టర్ మల్లేశ్వర రావు, ఏలూరు డిఎస్పి శ్రీనివాసులు, ఏలూరు టూ టౌన్ ఇన్ స్పెక్టర్ ప్రభాకర్, ఏలూరు త్రీ టౌన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు, కైకలూరు రూరల్ ఎస్సై రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, రాజకీయ పార్టీల నాయకులు, వారి ప్రధాన అనుచరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement