Saturday, July 27, 2024

T20WC | ఒమన్‌పై స్కాట్లాండ్ ఈజీ విక్టరీ..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగిన మరో మ్యాచ్‌లో గ్రూప్-బిలోని ఒమన్, స్కాట్లాండ్ జట్లు తలపడగా.. స్కాట్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేయగా.. అనంతరం చేజింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 13.1 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈజీ చేజ్ లో స్కాట్లాండ్ బ్యాటర్ బ్రాండన్ మెక్‌ముల్లెన్ (31 బంతుల్లో 61 నాటౌట్)తో హాఫ్​ సెంచరీతో చెలరేగాడు… ఓపెనన్ జార్జ్ మున్సే (41) తృటిలో హాఫ్​ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక మైఖేల్ అలెగ్జాండర్ జోన్స్ (16), రిచర్డ్ బెరింగ్టన్ (13), మాథ్యూ హెన్రీ (15 నాటౌట్) రాణించారు.

ఇక ఈ విజయంతో గ్రూప్‌లో ఉన్న స్కాట్లాండ్.. పాయింట్స్ టుబుల్‌లో ఐదు పాయింట్లతొ అగ్రస్థానానికి చేరుకుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement