Saturday, July 27, 2024

Custody | బిభవ్ కుమార్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌కు మళ్లీ మూడు రోజుల పోలీసు కస్టడీ విధించారు. 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అతడిని మళ్లీ కోర్టులో హాజరుపరచగా, ఇరుపక్షాల వాదనలు విన్న మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్.. మే 31 వరకు కస్టడీకి అనుమతించారు.

సోమవారం విచారణ సందర్భంగా హాజరైన స్వాతి మలివాల్.. తనకు బెదిరింపులు వస్తున్నాయని నిందితులకు బెయిల్ ఇవ్వరాదని వాదించారు. మే 13వ తేదీన స్వాతి మలివాల్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా.. బిభవ్ కుమార్‌ దాడికి పాల్పడ్డాడని దేశవ్యాప్తంగా సంచలనం అయింది.

ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కుమార్‌ను మే 18న అరెస్టు చేశారు. బిభవ్ కుమార్‌పై బెదిరింపు, దాడి, మహిళపై వేధింపులు, నేరపూరిత హత్యకు ప్రయత్నించడం వంటి నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement