Tuesday, May 28, 2024

IPL : కోహ్లీ @ 8000… ఐపిఎల్ లో టాప్ స్కోర‌ర్

ఐపీఎల్ చరిత్రలో కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 8,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నయా రికార్డు నెలకొల్పాడు. బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ప్రత్యేక మైలురాయిని సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో కోహ్లీ 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 రన్స్ చేశాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో 8 వేల రన్స్ చేసిన మొదటి క్రికెటర్ కోహ్లీనే. ఐపీఎల్‌లో 252 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 244 ఇన్నింగ్స్‌లలో 8004 రన్స్ బాదాడు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ అత్యధిక స్కోర్ 113 కాగా.. 705 ఫోర్లు, 272 సిక్సులు కొట్టాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ ఆర్‌సీబీ తరపునే ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఓ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. అంతేకాదు ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ కోహ్లీనే.

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అనంతరం అత్యధిక పరుగుల చేసిన ఆటగాడు శిఖర్ ధావన్. గబ్బర్ 222 మ్యాచ్‌లలో 6769 రన్స్ చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (6628), డేవిడ్ వార్నర్ (6565), సురేష్ రైనా (5528), ఎంఎస్ ధోనీ (5243), ఏబీ డివిలియర్స్ (5162) ఉన్నారు. వేరు మాత్రమే ఐపీఎల్‌లో 5 వేల కంటే ఎక్కువ రన్స్ చేశారు. కాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే ఆర్సీబీ కల వరుసగా 17వ సారి చెదిరింది. ముఖ్యంగా సుదీర్ఘకాలం నుంచి విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశ తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement