Thursday, July 25, 2024

Badminton Super Tournament : సింధూకి మ‌రో ప‌రీక్ష నేటి నుంచి సింగపూర్‌ ఓపెన్‌..

బ్యాడ్మింటన్‌ సూపర్‌’ టోర్నీ టైటిల్‌ కోసం రెండేండ్లుగా ఎదురుచూస్తున్న డబుల్‌ ఒలింపియన్‌ పీవీ సింధు.. తనకు అచ్చొచ్చిన సింగపూర్‌ ఓపెన్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం నుంచి సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీకి తెరలేవనున్న నేపథ్యంలో 2022లో ఇక్కడే విజేతగా నిలిచిన సింధు.

నాటి ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. ఏడాది తర్వాత ‘సూపర్‌’ సిరీస్‌ ఫైనల్‌ చేరిన సింధు.. మలేషియా మాస్టర్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు సింధుకు ఈ టోర్నీ చాలా కీలకం.

- Advertisement -

ఒలింపిక్స్‌కి రెడీ అవుతున్న వేళ‌..

తొలి రౌండ్‌లో భాగంగా బుధవారం ఆమె.. డానిష్‌ షట్లర్‌ లినెతో పోటీ పడనుంది. మహిళల విభాగంలో సింధుతో పాటు ఆకర్షి కశ్యప్‌, డబుల్స్‌లో అశ్విని-తనీషా బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో లక్ష్యసేన్‌, ప్రణయ్‌, కిడాంబి శ్రీకాంత్‌ సత్తాచాటాలని భావిస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో స్టార్‌ షట్లర్లు సాత్విక్‌- చిరాగ్‌ స్వల్ప విరామం తర్వాత మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గెలిచి తిరిగి ప్రపంచ నంబర్‌వన్‌ స్థానం దక్కించుకున్న భారత ద్వయం ఇక్కడా మెరిసేందుకు సిద్ధమయ్యారు. విశ్వక్రీడలకు సన్నద్ధమవుతున్న భారత షట్లర్లకు సింగపూర్‌ ఓపెన్‌ మంచి సన్నాహకంగా మారనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement