Tuesday, May 28, 2024

Kalki2898AD | కల్కి నుంచి బుజ్జి క్యారెక్టర్ రివీల్…

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ కల్కి 2898AD. ఈ సినిమాపై ఇప్పటికే ఆభిమానుల్లొ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ రిలీజ్‌కి రెడీ అయ్యింది. కాగా, తాజాగా (బుధవారం) రామోజీ ఫిలిం సిటీలో భారీ వేడుకను నిర్వహించింది కల్కి టీం. ఈ వేడుకలో ‘కల్కి’ సినిమాలోని బుజ్జి పాత్రను పరిచయం చేశారు.

YouTube video

ఈ కల్కి సినిమాలో ప్రభాస్‌తో పాటు.. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇలా భారీ తారాగణంతో.. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని హాలీవుడ్ రేంజ్‌లో రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఇప్పటికే తిరుగులేని క్రేజ్‌ని దక్కించుకున్న ప్రభాస్.. కల్కి సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ రేంజ్‌పై కన్నేసినట్టే కనిపిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement