Thursday, May 16, 2024

హ్యాపీ బర్త్ డే ‘కళ్యాణ్ దేవ్’..కిన్నెరసాని థీమ్

హీరో కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న  కిన్నెరసాని మూవీ నుండి వీడియోని రిలీజ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా థీమ్ ఆఫ్ కిన్నెర‌సాని వీడియో విడుద‌ల చేశారు. ఇందులో కాలుతున్న పేపర్ ఎగురుకుంటూ వచ్చి రోడ్ మీద పడటం.. అదే సమయంలో వర్షం పడటం.. చివ‌ర‌లో క‌ళ్యాణ్ దేవ్ ఫొటో చూపించ‌డం సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది.  ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తాళ్లూరి   నిర్మిస్తున్నారు. దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ క‌ల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించ‌డం విశేషం.  మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement