Thursday, May 2, 2024

పిజెఆర్ కుమార్తె విజ‌యారెడ్డి అల‌క – కౌన్సిల్ నుంచి బాయ్ కాట్..

హైదరాబాద్: గ్రేట‌ర్ మేయ‌ర్ పీఠంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న దివంగ‌త నేత పి జ‌నార్ధ‌న్ రెడ్డి కుమార్తె విజ‌యారెడ్డి కి టిఆర్ ఎస్ నాయ‌క‌త్వం షాక్ ఇచ్చింది. మేయ‌ర్ ప‌ద‌విని ఆమెకు కేటాయించ‌క‌పోవ‌డంతో అల‌కబూనారు.. అధిష్టానం టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతను అధిష్టానం ఎంపిక చేసినట్లు స‌మాచారం. దీంతో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కార్పొరేట‌ర్ గా ప్రమాణ స్వీకారం చేసి మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే ఆమె అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారు. గతంలో కూడా విజయారెడ్డికి మేయర్ పీఠం దక్కుతుందని పీజేఆర్ అభిమానులు, అనుచరులు భావించారు. అప్పుడు కూడా టీఆర్ఎస్ అధిష్టానం ఆమెను నిరాశపరిచింది. ఈసారైనా మేయర్ పీఠం దక్కుతుందని ఆమె భావించారు కానీ ఈసారి కూడా మొండి చెయ్యి చూపించడంతో విజయారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై మేయర్ ఎన్నికల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement