Tuesday, May 14, 2024

CSK vs PBKS | చెన్నై డెన్‌లో పంజాబ్ విజయం..

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కేను స్వల్ప పరుగులకే పరిమితం చేసిన పంజాబ్… ఛేజింగ్‌లోనూ అదరగొట్టింది. ఫలితంగా, సీఎస్‌కే నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది.

స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు జానీ బెయిర్‌స్టో (46), రిలీ రోసోవ్ (43) పరుగులతో చెలరేగి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ఇక వీరి తరువాత వచ్చిన శశాంక్ సింగ్ (25 నాట్ అవుట్ ), కెప్టెన్ సామ్ కర్రాన్(26 నాట్ అవుట్ ) లు సీఎస్‌కే బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఛేజింగ్ పూర్తిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement