Wednesday, May 22, 2024

TS : బీఆర్ఎస్‌ చచ్చిన పాము…. రాజ్య‌సభ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్‌

బీఆర్ఎస్‌ చచ్చిన పాము… కారు గారేజ్ నుండి వచ్చే అవకాశం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కదన్నారు.

- Advertisement -

రాష్ట్రాన్ని కాంగ్రెస్ పెను సంక్షోభం లోకి నెట్టబోతుందన్నారు. రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసిన… ఉచితాల్ని , గ్యారంటీ లను ప్రజలు నమ్మలేదు….అలవి గానీ హామీలు ఇచ్చారన్నారు. అప్పు చేస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు.

అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని, మోదీని గెలిపించాలని పట్టుదలతో పార్టీలను కాదని మోదీ వైపు మొగ్గుచూపారని పోలింగ్ శాతం కూడా మాకు సానుకూలం అనే భావిస్తున్నామని, రెండు సార్లు అధికారం లో ఉన్న మోదీ పై వ్యతిరేకత కాకుండా సానుకూలత పెరిగిందన్నారు. దేశాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళ్లే సత్తా ఆయనకు ఉందని ప్రజలు విశ్వసించారని, ఓట్లకోసం ఉచితాలు అయన ఇవ్వదని ప్రజలు భావించారన్నారు ఎంపీ లక్ష్మణ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement