Wednesday, May 15, 2024

TS | క్రిశాంక్ ఒక ఉద్యమ గొంతు… అతడి అరెస్టు అన్యాయం : కేటీఆర్‌

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంత్ అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. క్రిశాంక్ అరెస్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్రిశాంక్ అరెస్ట్ కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రయత్నమని విమర్శించారు. ఈ కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

క్రిశాంక్‌ అంటే ఒక ఉద్యమ గొంతుక.. ఒక చైతన్య ప్రతీక, యువతరానికి ప్రతిబింబమన్నారు. గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై.. ఢిల్లీ బీజేపీ అరాచకాలపై.. గళమెత్తినందుకే ఈ దౌర్జన్యం.. ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గమంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ నియంతృత్వ.. నిర్బంధాలకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. నాడు ఎమర్జెన్సీ చూశామని.. నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు.. ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్, బీజేపీలకు పట్టడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement