Monday, July 22, 2024

Gold Quest – క‌ర్నూలు జిల్లా వేదిక‌గా గోల్డ్ మైన్స్ త‌వ్వ‌కానికి రెడీ

చాలా ఏళ్ల తర్వాత మన దేశంలో బంగారం ఉత్పత్తి మొదలుకానుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. దేశంలో ప్రైవేటు రంగంలో ఫస్ట్ గోల్డ్ మైన్ ఇదే. ఏపీలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనిలో కొద్దిరోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు 80శాతం పూర్తి అయ్యాయి. నాలుగైదు నెలల్లో ఉత్పత్తి మొదలు కానున్నట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ వెల్లడించింది.

స్థ‌ల సేక‌ర‌ణ‌, ప్లాంట్ ప‌నులు రెడీ..

దీనికోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడం, ప్లాంట్ పనులు చేపట్టింది. ఏటా 750 కిలోల బంగారు ఉత్పత్తి చేయాలన్నది ఆ కంపెనీ అంచనా. ఇప్పటివరకు ఈ బంగారు గనిపై దాదాపు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టింది. ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని పసిడి గనులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీటిని తవ్వేందుకు ప్రభుత్వ రంగం సంస్థ ఎన్ఎండీసీ ముందుకొచ్చింది. వీటిని తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

- Advertisement -

బ్రిటిష్ కాలానికి ముందు నుంచే..

రాయలసీమలో బంగారం కోసం అన్వేషణ ఈనాటిది కాదు. బ్రిటిష్ పాలనకు ముందు మహమ్మదీయులు, శ్రీకృష్టదేవరాయుల కాలంలో కూడా మైనింగ్ జరిగినట్టు ఆధారాలున్నాయ‌ని చెబుతున్నాయి. అపారమైన ఖనిజ నిక్షేపాలు బంగారం, వజ్ర సంపద ఉన్న ప్రాంతంలో అశోకుడు ఆయన అధికారులు విడిది చేశారని అంటున్నారు. ఇందుకు సాక్ష్యం జొన్నగిరి సమీపంలో అశోకుని శిలాశాసనాలే ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తానికి రాయలసీమ పసిడికి ఉత్పత్తికి వేదిక కావ‌డం మ‌రో ప్రాధాన్యంగా మారింది.

విదేశాల్లోనూ ద‌క్క‌న్ గోల్డ్ త‌వ్వ‌కాలు..

దక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ విషయానికొస్తే.. దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు నిర్వహిస్తోంది. ఈ సంస్ధ విదేశాల్లోనూ గనుల ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌లో లిథియమ్ గనులు కొనుగోలు చేసింది. దీన్ని అక్కడి మాగ్నిఫికా గ్రూప్‌తో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. అందులో దక్కన్ గోల్డ్ మైన్స్‌కు 51 శాతం ఉండగా, దాన్ని 75 శాతానికి పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది.

రాజస్థాన్‌లో బంగారు గ‌నులు

బంగారం గనుల కోసం దేశంలో విపరీతమైన పోటీ నెలకొంది. రాజస్థాన్‌లో రెండు గనుల కోసం వేదంతా గ్రూప్, హిందుస్థాన్ జింక్, జిందాల్ పవర్ పోటీ ప‌డుతున్నాయి. కంక్రియా గారా గోల్డ్ బ్లాక్, భూకియా-జగ్ పూరా బ్లాక్‌లను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే వేలం తేదీని ఖ‌రారు చేసింది.. తాజాగా వేలంలో పాల్గొనేందుకు సాంకేతిక అర్హత సాధించిన కంపెనీల్లో అవి కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement