Monday, July 22, 2024

Weldon – ఓట‌ర్ల కోసం గ్రీన్ చాన‌ల్ …. ఆటంకం లేకుండా విశాఖ‌కు రైలు

విజ‌య‌వాడ నుంచి విశాఖ‌కు నాన్ స్టాప్ ట్రెయిన్‌
చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి అంటున్న అధికారులు
నాందేడ్ నుంచి సికింద్రాబాద్‌కు తొమ్మిది గంట‌ల ఆల‌స్యం
వెయ్యి మందికి పైగాగానే విశాఖ‌కు వెళ్లాల్సిన ఓట‌ర్లు..
రైలు ఆల‌స్యంతో ఓటింగ్‌కు వెళ్ల‌లేమ‌నే గుబులు
సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఆవేద‌న షెర్ చేసుకున్న ప్ర‌యాణికులు
స్పందించిన ఎన్నిక‌ల సంఘం.. డివిజ‌న‌ల్ రైల్వే అధికారులు
విజ‌య‌వాడ నుంచి విశాఖ‌కు గ్రీన్ చాన‌ల్‌తో రూట్ క్లియ‌ర్
13వ తేదీ సాయంత్రం 4. 55కి విశాఖ‌కు చేరిన రైలు
అప్ప‌టికే రెడీగా బ‌స్సులు, కార్లు, ఆటోలు..
త‌ర‌లివెల్లి ఓటు హ‌క్కు వినియోగించుకున్న వెయ్యి మంది
ఈసీ నిర్ణ‌యం.. రైల్వే అధికారుల చ‌ర్య‌ల‌కు కృత‌జ్ఞ‌తలు

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరిన ఓటర్లకు పోలింగ్ రోజు చుక్కలు కనిపించాయి. షెడ్యూల్ ప్రకారం 20812 నాందేడ్ రైలు 12వ తేదీ రాత్రి 9.30కు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మర్నాడు ఉదయం 10.15కల్లా విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది. నాందేడ్‌లో సాయంత్రం 4.30కు బయల్దేరే రైలు ఐదు గంటల్లో సికింద్రాబాద్‌ చేరుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఆ రోజు రైలు సాంకేతిక కారణాలతో సికింద్రాబాద్‌కు ఆలస్యంగా వ‌చ్చింది. రాత్రి 9.30కు రావాల్సిన రైలు మర్నాడు ఉదయం 5.30కు స్టేషన్‌ నుంచి బయలు దేరింది.

- Advertisement -

ఓటు వేసేందుకు వెళ్తున్న వెయ్యి మంది..

కాగా, నాందేడ్-విశాఖపట్నం రైలులో విశాఖ వెళ్లి ఓటు వేయడానికి దాదాపు వెయ్యిమంది ప్రయాణికులు బయలుదేరారు. రైలు ప్రయాణంపై సికింద్రాబాద్‌లో క‌చ్చితమైన సమాచారం లేకపోవడంతో పోలింగ్ ముగిసేలోగా గమ్యానికి చేరుకుంటామని భావించారు. అయితే.. సికింద్రాబాద్‌లో రైలు బయలుదేరిన తర్వాత కూడా ప్రయాణంలో తీవ్రమైన జాప్యం జ‌రిగింది. దీంతో ప్రయాణికులు విసిగిపోయారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో తాము ఓటు వేసే హక్కు కోల్పోతామని ఆందోళన చెందారు.

సోష‌ల్ మీడియాలో ఆవేద‌న‌..

ఓటు వేయాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరినా.. సోమవారం మధ్యాహ్నానికి ఖమ్మం సమీపంలోనే ఉండిపోయారు. దీంతో ప్రయాణికులు సోషల్ మీడియాను ఆశ్రయించారు. రైల్వే అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే తాము ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకునే వారిమని సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడంతో ఇది ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. రైలు బాగా ఆలస్యంగా నడుస్తోందని, ఓటువేసే అవకాశం కోల్పోతామన్న వీడియో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా దృష్టికి రావడంతో ఆయ‌న స్పందించారు. విజయవాడ, విశాఖపట్నం డివి జనల్ రైల్వే మేనేజర్లతో మాట్లాడి రైలును సాయంత్రం ఆరుకంటే ముందే విశాఖ చేర్చాలని ఆదేశించారు.

ఈసీ రెస్పాండ్‌.. రైల్వేకు సూచ‌న‌లు

సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా చూసి, వారికి ఓటు వేసే అవకాశం ఉండటంతో ఆలోపే రైలును విశాఖకు చేర్చాలని ఈసీ అధికారులు సూచించారు. దీంతో ఇద్దరు డీఆర్ఎంలు స్పందించి నాందేడ్-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కడా ఆగకుండా రూట్ క్లియర్ చేశారు. రైలు కోసం ఏకంగా గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు.

విజ‌య‌వాడ రాకుండేనే..

ఈ రైలు విజయవాడ రాకుండానే ఔటర్‌లోనే నేరుగా విశాఖ వెళ్లిపోయింది. రాయనపాడు తర్వాత రాజరాజేశ్వరిపేట క్రాసింగ్ మీదుగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమ హేంద్రవరం, దువ్వాడల్లో మాత్రమే ఆగింది. రైల్వే పనుల వల్ల ఎక్కడా ఆగకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆ రైలుకు క్రాసింగ్ లేకుండా నేరుగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 4.55 గంటలకు విశాఖపట్నం చేరింది. ముంద‌స్తు స‌మ‌చారంతో ఆర్టీసీ బ‌స్సులు, కార్లు, ఆటోలు స్టేష‌న్ వ‌ద్ద దిగే ఓట‌ర్ల కోసం సిద్దంగా ఉంచారు అధికారులు. దీంతో విశాఖలోని ప్రయాణికులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు తగిన సమయం ఉండటంతో తద్వారా పోలింగ్‌కు సమయం ఏర్ప‌డింది. పోలింగ్ కేంద్రా లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.. రైలు ఆల‌స్య‌మైనా స‌కాలంలో పోలింగ్ కేంద్రాల‌కు చేర్చ‌డంతో ఓట‌ర్లు ఎన్నిక‌ల సంఘానికి, రైల్వే అధికారుల‌కు కృత‌జ్ఞ‌తలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement