Tuesday, July 23, 2024

Aiden Markrum : టీమ్ ఇండియాకు ఆశాకిర‌ణం అభిషేక్ శ‌ర్మ‌…

యువ ప్లేయర్ అభిషేక్ శర్మపై దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. త్వరలో అభిషేక్ టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడని అన్నాడు. అంతేగాక భవిష్యత్‌లో ఆ భారత కుర్రాడు ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన విజయాల్లో అభిషేక్ శర్మ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ ఎస్‌ఆర్‌హెచ్‌కు మెరుపు ఆరంభాల్ని అందిస్తున్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తూ సత్తాచాటుతున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 36 సగటు, 205 స్ట్రైక్‌రేటుతో 405 పరుగులు చేశాడు. ఐపీఎల్-2024లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ (35) రికార్డు నెలకొల్పాడు.

- Advertisement -

ఈ నేపథ్యంలో అభిషేక్‌ను కొనియాడుతూ మార్క్‌రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ”గత సీజన్లలో అభిషేక్ శర్మ సానుకూల సంకేతాలు చూపించాడు. కానీ ఈ సీజన్‌లో అతడు భారీ విజయాలు సాధించాడు. నిలకడగా సత్తాచాటుతూ మంచి స్థితిలో కొనసాగుతున్నాడు. ఓ రోజు భారత్ తరఫున అతను కచ్చితంగా అరంగేట్రం చేస్తాడని ఆశిస్తున్నా. అతనుక్ ఎంతో ప్రశాంతతో ఆడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా సత్తాచాటుతున్నాడు. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు” అని మార్క్‌రమ్ అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement