Tuesday, July 23, 2024

AP: మ‌ళ్లీ అధికారం మాదే… జ‌గ‌న్ ధీమా

రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్నారు. ఐప్యాక్ కార్యాలయానికి వచ్చిన జగన్ అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఐప్యాక్ టీం ప్ర‌తినిధుల‌తో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. ఈసంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లోనూ ఎవరూ 151 సీట్లు వస్తాయని నమ్మలేదన్నారు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పారు.

మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామ‌న్నారు. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం.. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తామ‌న్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించబోతోందన్నారు. జూన్ 4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందన్నారు. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుందన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయన్నారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దామ‌న్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని జగన్ అన్నారు.

గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్లో ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐప్యాక్ పని చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement