Wednesday, May 29, 2024

శృతి తప్పిన ఆత్మస్తుతి…అధోగతే!

ఇతరులను తరచుగా నిందిస్తూ త మను తాము పొగుడుకునే అలవాటు గలవారు చాలామంది ఉన్నారు. ఈ తరహా మనుషులు తమ గురించి తామే ఎంతో గొప్పగా చెబుతారు. ఆవగింజ సాయం చేస్తే హమాలయ మంత సాయం చేసినట్లుగా చెప్తారు. అడిగి నవారికి అడగనివారికి చెప్తారు. అంతటితో ఆగకుండా ఇతరులను దుయ్యబడతారు. ఇతరులు చేసిన మంచిని దాచివేస్తారు. వారిలోని లోపాలను గోరంతవి కొండంతలు చేస్తారు. అదేపనిగా విమర్శిస్తారు. ప్రజ్ఞకు తగిన గుర్తింపుపొందే క్రమంలో కొందరు తమను తామే పొగ డుకుంటూ, తమకున్న ప్రతిభ అసామాన్యమైనదని స్వోత్కర్ష చేసు కుంటారు. అటువంటివారు తమ ప్రతిభను వ్యక్తపరచడంలో వివేక వంతంగా వ్యవహరించలేరు.
ఎప్పుడైనా ఆత్మస్తుతి ఎక్కువైతే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ నిర్వహణలో కళారంగాల్లో గానీ ఎవరైనా గుర్తిం పును ఆశిస్తే ముందుగా వాళ్ళ గురించి వాళ్లు చెప్పుకోవడం మానే యడం వివేకవంతమైన పని. ఇతరులు తమ ప్రతిభ గురించి మాట్లా డుకునేలా ప్రవర్తనను హుందాగా మలుచుకోవాలి. తమ నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా మాటల ద్వారా కాకుండా పరోక్షంగా ప్రకటించాలి. ఎలాంటి ప్రచారం లేకుండా ప్రతిభను ఇతరులు గుర్తిస్తే తప్పకుండా మంచి ప్రచారం లభిస్తుంది. చేతల్లో తమ నైపుణ్యాన్ని చాటుకోవాలే తప్ప, మాటలతో తమను తాము కీర్తించుకోవడం అవివేకం, అసంద ర్భం. ఇలాంటి చర్యల వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరదు. వాస్త వానికి విద్వత్సంపన్నులు, ప్రతిభావంతులు ఆత్మస్తుతి జోలికి పోరు. నిరంతరం వారు చేసే పనిలో నైపుణ్యాల్ని చూపాలనే ప్రయత్నం చేస్తా రు. కీర్తికాంక్ష అధికంగా వున్నవాళ్ళు మాత్రం సొం త ప్రచారం చేసుకు ని ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటివారిని ఎవరూ మనస్ఫూర్తిగా మెచ్చుకోరు. మెప్పును ఆశిం చేవారు ఇతరుల్లో వుండే ప్రతిభను అభినందించే ఉదార స్వభావం, మంచి లక్షణాలు కలిగి వుండాలి. ఇతరుల్లో వుండే సామర్థ్యాన్ని కొనియాడితే తామెక్కడ తక్కువ కాబడతామనో అనే భావనతో కొంతమంది వుంటారు. ఈ సంకుచిత స్వభావం వున్నవాళ్ళు ఎప్పటికీ కీర్తి ని పొందలేరు.
ప్రభుత్వాలు, ప్రజలు పరస్పరం నిందిం చుకునే సంస్కృతికి ముగింపు పలకాలి. ప్రజలు ప్రభుత్వం పర్యాయ పదాలన్న విషయం అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అంగీకరించే సహన, సహకార సం స్కృతికి ఆహ్వానం పలకాలి. ఇక, అదేపనిగా పరులను నిందించే మన స్తత్వం ఉన్నవారు క్రమంగా వ్యక్తిత్వం కోల్పోతారు. దీనిని ఒక మాన సిక రుగ్మతగా చెప్పవచ్చు. అందుకే ఆత్మస్తుతి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఈ మనస్తత్వం వున్న వాళ్ళు సమయం, సందర్భం లేకుండా తమ గురించి చెప్పుకుపోతూ, వినేవాళ్లు ఏమనుకుంటు న్నారో తెలుసుకోరు. ఇది ఒక అజ్ఞానం. ఇతరులను పరోక్షంలో నిం దించే అలవాటుగల అందరకూ వర్తిస్తుంది. కాబట్టి ఇతరులను నిం దించరాదు అనే ”హతవచనాన్ని” తు.చ. తప్పక పాటిస్తే జీవితం ఆనందమయమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement