Tuesday, July 23, 2024

TS : సిరిసిల్లలో నకిలీ మందులు సీజ్

కిడ్నీలో రాళ్ల బరువు తగ్గిస్తామని మందులు వారిదగ్గర వున్నాయని నమ్మించి ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. వారి మాటలను నమ్మి మోసపోతున్నవారు లక్షల్లో.. వేలల్లో ఉన్నారంటే మనం ఎంతగా ఎదుటి వారి మాటలు నమ్ముతున్నామో అర్థమవుతుంది. ఇలాంటి ఘటనే రాజన్న సిరిసిల్లలో చోటుచేసుకుంది.

సిరిసిల్లలో నకిలీ మందులు అమ్ముతున్న మెడికల్ షాపులో డ్రగ్ కంట్రోల్ సోదాలు నిర్వహించారు. కిడ్నీలో రాళ్ల బరువును తగ్గిస్తామంటూ మెడికల్ షాపులు మందులు విక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో సోదాలు చేపట్టారు. తప్పుడు ప్రచారాలతో నకిలీ మందులు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో కొరడా జులిపిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు, అధిక బరువుని తగ్గిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై పక్కా సమాచారంతో డ్రగ్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. పలువురిని అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి వెనుక ఇంకా ఎంత మంది వున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement