Wednesday, May 22, 2024

పరిపూర్ణ పెన్నిధి… సాయి సన్నిధి

”శ్రీ సాయినాథులను కృష్ణుని అవతారంగా భావించినట్లయితే శ్యామాను అర్జునుడి అవతారంగా భావించాలి” సుప్రసిద్ధ మరా ఠీ రచయిత బాలాసాహెబ్‌ దేవ్‌ తన గ్రంథంలోనిది ఈ వాక్యం.
సాయి సచ్చరిత్రలో హమాద్రి పంత్‌ సాయిని శివునిగా, శ్యా మాను నందీశ్వరునిగా అభివర్ణిస్తాడు. సాయి సచ్చరిత్రను చది విన వారందరికీ శ్యామా పేరు సుపరిచితమే. సాయి భక్తులందరి లో శ్యామా అగ్రగణ్యుడు, శ్రీ రాముడిని అద్యంతం కంటికి రెప్ప లా కనిపెట్టుకొని వున్న ఆంజనేయునివలే శ్యామా శిరిడీలో సా యి నివసించినంత కాలం ఆయనను కనిపెట్టుకొని వున్నాడు. ఆ అమాయక పల్లెటూరు చక్రవర్తికి సాయి దేవా, సాయి మ హరాజ్‌ తప్ప వేరే నామం తెలియదు. సాయి కూడా శ్యామాను తన హృ దయానికి దగ్గరగా వుంచుకొన్నాడు.
మాధవరావ్‌ దేశ్‌పాండే 1860వ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి నాడు బల్వంతరావ్‌ దేశ్‌పాండే, లక్ష్మణమ్మ కులక ర్ణిలకు యజుర్వేద దేశస్థ బ్రా హ్మణ కుటుంబంలో నిమోన్‌ గ్రా మంలో (సంగమ్నేర్‌ తాలూకా, అహ్మద్‌నగర్‌ జిల్లాలో) జన్మిం చాడు. బల్వంతరావు మొదట మూడు వివాహాలు చేసుకున్నా సంతానం కలగలేదు. ఇక ఆఖరు ప్రయత్నంగా శిరీడీ వాస్తవ్యురా లైన లక్ష్మమ్మ కులకర్ణిని వివాహం చేసుకున్నాడు. దైవ కృప వలన ఆ దంపతులకు ముగ్గురు సంతానం కలిగారు. పెద్దవాడు మాధ వరావు, రెండవవాడు కాశీనాథ్‌, మూడవవాడు బాపాజీ.
మాధవరావుకు మూడేళ్ళ వయసులో బల్వంతరావు కు టుంబం శిరిడీకి వచ్చి స్థిరపడిపోయారు. ఆరవ తరగతి వరకు మాధవరావు చదువు శిరిడీలోనే సాగింది. అక్కడ పై చదువులు లభ్యంకానందున, వారి ఆర్ధిక పరిస్థితు లు అంతంత మాత్రంగా వుండడం వలన మాధవరావు తన చదువులకు అంతటితో స్వస్థి పలకవలసి వచ్చింది. పై చదువులు చదవని కారణంగాను, జీవితమంతా పల్లెటూరిలో జీవించిన కారణంగానూ అతనిలో గ్రామీణ అమాయాకత్వం ప్రతిబింబి స్తుండేది. భాష కూడా వినేవారికి నవ్వు పుట్టిస్తుండేది.
యుక్తవయస్సు వచ్చాక మాధవరావు సావిత్రిబాయిని పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఏకనాథుడనే కుమారుడు కలిగాడు. అతను ద్వారకాబాయి అనే శిరీడీ వాస్తవ్యురాలిని రెండవ వివాహం చేసుకున్నాక వారికి జగన్నాథ్‌ పంత్‌, ఉద్ధవరావు అనే కు మారులు, బబితాయి అనే కుమార్తె కలిగారు.
పల్లెటూరి జీవనం కారణంగా మాధవరావుకు జలుబు, జ్వరం వంటి సామాన్యమైన వ్యాధులు కూడా అతనికి డబ్భై ఏళ్ళ వయసులో కూడా దరిచేరేవి కావు. సనాతన బ్రా హ్మణ కుటుంబంలో పుట్టిన కారణంగా అతను సత్సంప్రదాయాలను విధిగా పాటించేవాడు. తన శాఖ వారి వద్ద తప్ప ఇతరుల ఇళ్ళలో కనీసం మంచినీళ్ళు కూడా ముట్టేవాడుకా దు. ఇంటిలోని వారికి అస్వస్థగా వున్నప్పుడు తానే స్వయంగా వంట చేసేవాడు తప్ప మిగతావారిని వంటింట్లోకి కనీసం రాని చ్చేవాడు కాదు.
జీవితం గడవడానికి పది హేనేళ్ళ వయసులోనే శిరిడీలోని ఎలిమెంటరీ స్కూలులో టీచర్‌గా మాధవరావు చేరాడు. సాయి భక్తుడైన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాలరావు గుండు అనువాడు శిరి డీలో మట్టి, ఇటుకలు, రేకులతో ఒక చిన్నగది కట్టించి ఇవ్వగా అందులోనే ప్రభుత్వ సహకారంతో స్కూలు నడపసాగాడు మాధవరావు. కొంతకాలం తర్వాత ఆ గదిలో రాధాకృష్ణ బాయి నివసించేది, మశీదుకు ఎదురుగా వున్న కిటికీ నుండి మాధవరా వు సాయిని గమనిస్తుండేవాడు. సాయి కొన్నిసార్లు అరబ్బీ, పెర్షి యన్‌ భాషలలో పాటలు పాడడం మాధవరావు చాలాసార్లు విన్నాడు. ఎప్పుడూ చిలిమి తాగుతూ శూన్యంలోకి చూస్తూ వింత భంగిమలు చేస్తూ అర్ధంకాకుండా మాట్లాడే సాయిని శ్యామా మొదట్లో పిచ్చి ఫకీరు అనుకున్నాడు. కొంతకాలా నికి సాయి సత్పురుషుడన్న విశ్వాసం ఏర్పడింది.తన జీవితంలో 42 సంవత్సరాలు సాయి సన్నిధిలోనే గడి పిన ధన్యజీవి మాధవరావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement