Thursday, May 16, 2024

శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల‌కు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1,23,937 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,54,992 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.4 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ఇప్పుడు 212.43 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement