Wednesday, May 8, 2024

పునఃప్రారంభమయిన వాట్సాప్

ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు చోట్ల వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. కాగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు సర్వీసులు ఆగిపోయాయి. మెసేజీల సెండింగ్, రిసీవింగ్ నిలిచిపోయాయి. కనీసం డెలివరీ స్టేటస్ కూడా కనిపించలేదు. దీంతో, కోట్లాది మంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ప్రతి దానికి వాట్సాప్ మీదే ఆధారపడి ఉండటంతో… ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి చాలా మంది వెళ్లిపోయారు. ఈ సమస్యపై వర్క్ చేసిన వాట్సాప్ టెక్నికల్ టీమ్ సమస్యను పరిష్కరించింది. సర్వీసులను పునరుద్ధరించింది. మరోవైపు, సమస్య ఏమిటనేది వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. కాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇంకోవైపు, వాట్సాప్ మళ్లీ యథావిధిగా పని చేస్తుండటంతో యూజర్లు హమ్మయ్యా అనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement