Monday, April 29, 2024

అన్నమయ్య కీర్తనలు : కరుణించవే

రాగం : హిందోళం
కరుణించవే నిజగతి బోధించవే
హరినిన్ను కొలువగ అలసీ ప్రాణి

కలలో నింతుల కలసి నట్లనే
వెలికాంతలలోడి వేడుకలు
లలి నిందుకుగా లంపటములు బడి
పలుమారు నూరక బడలీ ప్రాణి

నిన్నటి యాహార నిజరుచి వలెనే
అన్నువ నిప్పటి ఆహారము
యెన్ననిందుకే యిడుముల బొరలుచు
కన్నగతుల కడు కలగీ ప్రాణి

పరుసము సోకిన బంగారమువలె
పరమ భాగవత పట్టములు
అరయగ శ్రీ వేంకటాధిప నీకృప
యిరవుగ గని తుదకెక్కీ ప్రాణి

Advertisement

తాజా వార్తలు

Advertisement