Sunday, May 19, 2024

Meenakshi Chaudhary : ముత్యాల హారంతో మురిపెం…

సుశాంత్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది మీనాక్షి చౌద‌రి. ఆ త‌ర్వాత మ‌హేష్ లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న గుంటూరు కారం చిత్రంలో అవ‌కాశం అందుకుంది. ఇప్పుడు త‌మిళనాడు సూప‌ర్ స్టార్ విజ‌య్ స‌ర‌స‌న గోట్ చిత్రంలో నటించేస్తోంది. మీనాక్షి ఈ చిత్రంలో సోలో క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుంది.

- Advertisement -

ఒక్కో సినిమాతో ఈ బ్యూటీ స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది. అందానికి అందం ప్ర‌తిభ‌తో ఇదంతా సాధించుకుంది మీనాక్షి చౌద‌రి. అంద‌మైన నవ్వు ఈ అమ్మ‌డిలో మ‌రో అద‌న‌పు హంగు. మీనాక్షి మ‌రోవైపు వ‌రుస‌గా సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌తోను అంత‌ర్జాలంలో వేడి పెంచుతోంది.

తాజాగా మీనాక్షి రెడ్ హాట్ డ్రెస్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. మీనాక్షి సింపుల్ లుక్ లో క‌నిపిస్తున్నా.. త‌న మెడ‌లో ముత్యాల హారం ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. మంచి ముత్యాలతో త‌యారు చేసిన స్పెష‌ల్ డిజైన‌ర్ హారం మీనాక్షి అందాన్ని ప‌దింత‌లు పెంచిందంటే అతిశ‌యోక్తి కాదు.

రెడ్ ఫ్రాక్.. రెడ్ లిప్స్ దానికి పూర్తి కాంట్రాస్ట్ గా ముత్యాల హారం ఎంతో అందంగా మ్యాచింగ్ కుదిరింది. మీనాక్షి స్మైలీ ఫేస్ తో ఫోజులు అంతే ఇదిగా ఆక‌ట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement