Tuesday, July 23, 2024

Kajal Aggarwal : క‌న్న‌ప్ప‌లో చంద‌మామ ….

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై అంచనాలు రోజురోజుకు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. . డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నార్త్‌ నుంచి సౌత్‌ వరకు పలువురు స్టార్స్‌ భాగమవుతున్నారు. అక్షయ్‌ కుమార్‌, ప్రభాస్‌, మోహన్ లాల్, శివరాజ్‌ కుమార్‌ తోపాటు చాలా మంది అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు..

దీంతో కన్నప్ప చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వరుస అప్డేట్స్ వస్తుండడంతో కన్నప్ప ప్రాజెక్ట్ ట్రెండింగ్ లోనే ఉంటోంది. ఇటీవల అక్షయ్ షూటింగ్ పూర్తవ్వడం, ఆ తర్వాత ప్రభాస్ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం, టీజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం.. ఇలా అప్డేట్స్ తో కన్నప్ప కోసం చర్చ జరుగుతూనే ఉంది. తాజా కన్నప్ప మూవీ మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో పార్వతి పాత్రలో స్టార్ హీరోయిన్ నయనతార కనిపించనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

- Advertisement -

కానీ ఆ తర్వాత ఆమె నటించడం లేదని తెలిసింది. ఆమె ప్లేస్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు కన్నప్ప చిత్రంలో కాజల్ కీలక పాత్ర పోషిస్తుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఆమె ఏ పాత్రలో కనిపిస్తుందన్న విషయం మాత్రం బయటపెట్టలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement