Sunday, June 23, 2024

TS | ప్రీమియం మేమే చెల్లిస్తాం.. రైతులపై భారం పడనివ్వం : మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని మంత్రి సీతక్క వెల్లడించారు. రైతన్నలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతులపై భారం పడనివ్వమని ఆమె స్పష్టం చేశారు. ఈ సీజన్‌ నుంచే స్కీమ్‌ అమల్లోకి వస్తుందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అకాల వర్షాలకు తడిచిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.

కొనుగోలు వేగవంతం చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలిచ్చామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వానలకు పంటనష్టం జరిగిందన్నారు. కల్లాలలో తడిసిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరపున చర్యలు చేపట్టినట్లు సీతక్క వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement