Tuesday, July 23, 2024

Thailand Open | ఫైనల్లో సాత్విక్ చిరాగ్‌ జోడీ..

థాయిలాండ్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో చైనీస్‌ తైపీకి చెందిన లు మిగ్‌- చే మరియు టాంగ్‌ కేవీపై 21-11, 21-12 తేడాతో సాత్విక్‌- చిరాగ్‌ ద్వయం విజయం సాధించింది. కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించేశారు.

వరుసగా రెండు గేమ్‌లలోనూ ప్రత్యర్థి జోడీపై సాత్విక్‌- చిరాగ్‌ జోడీ పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇక ఆదివారం జరుగనున్న తుది పోరులో చైనా జోడీ చెన్‌బో యాంగ్‌- లియు యితో భారత టాప్‌ సీడ్‌ సాత్విక్‌- చిరాగ్‌ ద్వయం తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement