Sunday, May 19, 2024

TS | 9వ తేదీ నుంచి ఇంట‌ర్ కాలేజీల్లో అడ్మిష‌న్లు..

తెలంగాణ‌లోని జూనియ‌ర్ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు ఇంట‌ర్‌ బోర్డు బుధ‌వారం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ నెల (మే) 9వ తేదీ నుంచి తొలి ద‌శ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. 9 నుంచి మే 31వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా ఇంట‌ర్ కాలేజీల్లో స్వీక‌రించ‌నున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీ లోపు తొలి ద‌శ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ పూర్తి చేయ‌నున్నారు.

ఇక ఇంట‌ర్‌లో ప్ర‌వేశం తీసుకోవాల‌నుకునే విద్యార్థులు ఇంట‌ర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా ద‌ర‌ఖాస్తుకు జ‌త‌ప‌ర‌చాలి. ప్రొవిజిన‌ల్ అడ్మిష‌న్ పూర్త‌యిన త‌ర్వాత క‌చ్చితంగా ఒరిజిన‌ల్ మెమోతో పాటు టీసీ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన జీపీఏ ఆధారంగా ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. ప్ర‌వేశాల కోసం ఎలాంటి రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఆయా కాలేజీల‌కు ఇంట‌ర్ బోర్డు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement