Tuesday, April 30, 2024

రిషి సునక్ కి అభినందనలు తెలిపిన..మెహబూబా ముప్తీ

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముప్తీ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునక్ అభినంద‌న‌లు తెలిపారు..వ‌రుస ట్విట్ల‌తో బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బ్రిట‌న్ ప్ర‌ధానిగా ఎన్నికైన భార‌త సంత‌తి వ్య‌క్తి రిషి సున‌క్ ప‌దోన్న‌తిని యావ‌త్ భార‌తావ‌ని వేడుక‌గా జ‌రుపుకుంటున్న‌ప్ప‌టీకీ.. బ్రిట‌న్ ఒక జాతి మైన‌రిటీ స‌భ్యుడిని ప్ర‌ధాని మంత్రిగా అంగీక‌రించింద‌నే విష‌యం గుర్తించుకోవాలి. అయితే, భార‌త్ లో ఇప్ప‌టికీ మ‌న‌ము ఎన్నార్సీ, సీఏఏ వంటి విభ‌జ‌న‌, వివ‌క్షాపూరిత చట్టాల‌తో సంకేళ్ల‌తో చిక్కుకుంటున్నామ‌ని అన్నారు. బ్రిటన్‌కు తొలి భారతీయ సంతతి వ్య‌క్తి ప్రధాని కావడం గర్వకారణం. భారతదేశం అంతా దీనిని వేడుక‌గా సరిగ్గా జరుపుకుంటున్నప్పుడు.. యూకే ఒక జాతి మైనారిటీ సభ్యుడిని ప్రధానమంత్రిగా అంగీకరించినప్పటికీ, మేము ఇప్పటికీ ఎన్నార్సీ, సీఏఏ వంటి విభజన-వివక్షాపూరిత చట్టాల ద్వారా సంకెళ్లలో ఉన్నామని గుర్తుంచుకోవడం మాకు బాగా ఉపయోగపడుతుంది” అని మెహ‌బూబా ముఫ్తీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ప్ర‌భుత్వం పై ముఫ్తీ చేసిన వ్యాఖ్య‌లపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా స్పందించారు. “భారతదేశంలో ముగ్గురు ముస్లింలు, ఒక సిక్కు అధ్యక్షుడుగా ఉన్నారు. 10 సంవత్సరాలు సిక్కు ప్రధాన మంత్రిగా కొన‌సాగారు. దేశం వైవిధ్యం, క‌లుపుగోలుతనం గురించి ఇతరుల నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదని” అన్నారు. కానీ మెహబూబా ముఫ్తీ తప్పనిసరిగా చర్చను కొనసాగించి.. జ‌మ్మూకాశ్మీర్ కు ఒక హిందువును ముఖ్య‌మంత్రిగా తిరిగి ఇవ్వాలంటూ ఆయ‌న కౌంట‌రిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement