Monday, April 29, 2024

Snehareddy : స్ట‌న్నింగ్ లుక్ లో స్నేహారెడ్డి…

హీరోయిన్లకు అయినా క‌న్ను కుట్టే రూపం.. ఆ లుక్కు చూసారా? స్టార్ హీరో అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహారెడ్డి ఒక టాప్ మోడ‌ల్ కి, అంద‌మైన క‌థానాయిక‌కు ఎంత‌మాత్రం త‌గ్గ‌ర‌ని అభిమానులు ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్నారు. ఇలా డిజైన‌ర్ లుక్ లో క‌నిపించ‌డం స్నేహారెడ్డికి కొత్తేమీ కాదు. కానీ సెల‌బ్రిటీ వైవ్స్ లో మోడ‌లింగ్ లో స‌త్తా చాటే ట్యాలెంట్ త‌న‌కు ఉంద‌ని మ‌రోసారి నిరూపిస్తూ ఈ కొత్త లుక్ లో క‌నిపించారు.

- Advertisement -

రిమ్ జిమ్ డాడు ఔట్ ఫిట్‌కి రూప‌క‌ర్త‌… అని స్నేహారెడ్డి సోష‌ల్ మీడియాల్లో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ కొత్త లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా మారింది. స్నేహా ఈ డిజైన‌ర్ లుక్‌లో చాలా అందంగా ఉన్నారంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. లెద‌ర్ తో డిజైన్ చేసిన బాట‌మ్.. డిజైన‌ర్ టాప్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయంటూ ప్ర‌శంసిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో మీరా రాజ్ పుత్ త‌ర్వాత టాలీవుడ్‌లో అంత‌టి అంద‌గ‌త్తెగా స్నేహా వెలిగిపోతున్నారు..! అంటూ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. బ‌న్ని స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించేస్తుందేమో! అని కొంద‌రు స‌రదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement