Sunday, May 26, 2024

అందరికి ఒకేసారి వ్యాక్సిన్లు వేయలేం: కేంద్ర మంత్రి హర్షవర్ధన్​

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పుంజుకుంటున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్ సభలో మాట్లాడారు. కరోనా నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు హర్షవర్ధన్. ఇక కరోనా టీకాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, అవి సురక్షితమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ప్రతి వ్యాక్సిన్ నూ అందరికీ వేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్ సభలో ఆయన మాట్లాడారు. టీకా కార్యక్రమంలో వేగం పెరుగుతున్నందున అందరికీ టీకాలు వేస్తారా? అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.

ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు హర్షవర్ధన్ అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందాలంటే కష్టమన్నారు. అందుకే ప్రాధాన్య వర్గాల వారీగా కరోనా టీకాలు వేస్తున్నామన్నారు. శాస్త్రీయ వాస్తవాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకునే టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement