Monday, June 17, 2024

Archery | జ్యోతీ సురేఖ అదుర్స్‌.. టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం, మిక్సడ్‌ ఈవెంట్‌లో రజతం

భారత స్టార్‌ ఆర్చర్‌, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ వేదికపై మరోసారి అదరగొట్టింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2 టోర్నీలో జ్యోతి మహిళల కంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం.. మిక్స్‌డ్‌ విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది.

శనివారం జరిగిన మహిళల కంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత బృందం 232-226 తేడాతో టర్కీకు చెందిన హజల్‌ బురున్‌, ఐసే బెరా సుజెర్‌, బేగం యువా జట్టును ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు.

మరోవైపు కంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ-ప్రియాన్షు జోడీ 153-155 తేడాతో ఒలివియా డీన్‌-సాయర్‌ సులివన్‌ (అమెరికా) జంట చేతిలో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన మహిళల కంపౌండ్‌ వ్యక్తిగత ఈవెంట్‌లో జ్యోతి సురేఖ టైటిల్‌ను నిలబెట్టుకోలేక పోయింది. క్వార్టర్స్‌లో తెలుగామ్మాయి ఓటమిపాలైన విషయం తెలిసిందే. పురుషుల వ్యక్తిగత విభాగం కంపౌండ్‌లో ప్రథమేశ్‌ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement