Friday, May 31, 2024

TG | హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత.. పోలీసు వాహనం ధ్వంసం

కరీంనగర్, (ప్రభ న్యూస్) : హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న హనుమాన్ దేవాలయం నుండి గాంధీ రోడ్ లోని హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ శోభయాత్ర ప్రారంభించారు.

శోభయాత్రలో ఓ వ్యక్తి కత్తితో గందరగోళం సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వ్యక్తిని తమకు అప్పగించాలని హనుమాన్ దీక్షపరులు ఆందోళన దిగారు. ఈ క్రమంలో హనుమాన్ దీక్షాపరులు పోలీసు పెట్రోలింగ్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి చేయి దాటిపోకుండా దీక్షాపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బీజేపీ నాయ‌కులు నాయకులు 3 టౌన్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement