Friday, May 31, 2024

TG | రీజినల్ రింగ్ రోడ్డుపై వ్య‌య‌ భారం.. పెరిగిన ముడి స‌రుకుల ధ‌ర‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌కు తలమానికంగా నిర్మించాలని భావిస్తున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు వ్యయం రూ.6 వేల కోట్లు పెరిగింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 158.65 కిలో మీటర్లతో 2021లో ఎలైన్‌మెంట్‌ ఖరారు కాగా..ఉత్తర భాగానికి రూ.9164 కోట్లు అవుతుందని అంచనా ఉండేది.

ఇప్పుడు ఆ అంచనా వ్యయం రూ.15 వేల కోట్లకు పెంచింది. ఎన్నికల కోడ్‌ ముగిశాక భూ సేకరణ ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును తెలంగాణకు తలమానికంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సగం తెలంగాణ అభివృద్ధి చెందేందుకు ఇది సూపర్‌ గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడినా.. పనుల్లో కదలిక లేదు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రీజినల్‌ రింగ్‌ రోడ్‌ వ్యయం రూ.6 వేల కోట్లు పెంచింది..

రాష్ట్రంలో తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారులోకి రాగా.. ఆర్‌ఆర్‌ఆర్‌కు చిక్కుముడులు వీడుతున్నాయి. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా తొలగించాల్సిన పైపులైన్లు, కేబుళ్లు, స్తంభాలు (యుటిలిటీస్‌) తదితరాల తరలింపు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆ వ్యయం దాదాపు రూ.200 కోట్లు భరించడానికి ఒప్పుకుంది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేసినట్లు తెలిసింది. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వంపై అదనపు భారం తప్పింది.

- Advertisement -

ఈ వ్యయాన్ని భరించే విషయంలో జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గడచిన ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌ ఖరారైనసమయంలో వేసుకున్నఅంచనా ప్రతిపాదనలు తాజాగా భారీగా పెరుగుతున్నాయి. 247 కిలోమీటర్ల రెండు విడతల నిర్మాణాలకు వ్యయం తడిసి మోపడవుతోంది.

2021లో అలైన్‌మెంట్‌ ఖరారు కాగా, కేంద్రరవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ జాతీయ రహదారికి నెంబర్‌ను కూడా కేటాయించింది. భూముల విలువలు, సిమెంట్‌, స్టీలు ఇతర ముడిపదార్ధాల ధరలు భారీగా పెరగడంతో ఈ మేరకు అంచనా వ్యరణ, పరిహారం, ఇతర ప్రయోజనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగంగా భరిసంచనున్నాయి.

రహదారి నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించనుంది. ఈ నేపథ్యంలో 158 కిలోమీటర్ల భాగం పూర్తికి రూ.15వేల కోట్లు అంచనా వేశీఆరు. ఉత్తర భాగం భూ సేకరణకు, ఇతరాలకు కలిపి రూ.9164 కోట్లుగా 2021లో అంచనా వేశారు. రెండేళ్లుగా పనుల్లో పురోగతి కానరాలేదు. దీంతో జాప్యం, ఇతర కారణాలు,ధరల పెరుగుదలతో ఈ వ్యయం రూ.6 వేల కోట్లు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement