Monday, June 17, 2024

Lava yuva | భారతీయ మార్కెట్లోకి ‘లావా యువ 5జీ’ ఎంట్రీ

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ త్వరలో భారత్‌ మార్కెట్లో లావా యువ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనున్నది. ఈ మేరకు లావా ఇంటర్నేషనల్‌ అధికారిక ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్‌ ధర రూ.10 వేల లోపు ధర ఉంటుందని తెలుస్తోంది. డ్యుయల్‌ రేర్‌ కెమెరా సెటప్‌తో వస్తున్న లావా యువ 5జీ ఫోన్‌ సర్క్యులర్‌ కెమెరా మాడ్యూల్‌ కలిగి ఉంటుంది.

ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు 50మ్ఖెగా పిక్సెల్‌ సెన్సర్‌ మెయిన్‌ కెమెరా, సెల్ఫీలూ వీడియోల కోసం 16మ్ఖెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా వస్తోందని తెలుస్తున్నది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఔటాఫ్‌ బాక్స్‌ వర్షన్‌ పై పని చేస్తుందని భావిస్తున్నారు. 6 జీబీ ర్యామ్‌, 8 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో మార్కెట్లోకి వస్తుందని తెలుస్తున్నది. లావా యువ 5జీ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ లేదా మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ ప్రాసెసర్‌తో గానీ వస్తుందని తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement