Friday, May 31, 2024

TG | కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు

కామారెడ్డి జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్టు తేలడంతో లక్ష్మణ్‌సింగ్‌ను సస్సెండ్ చేస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో లక్ష్మణ్‌సింగ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ చేయాల్సిన డీఎంహెచ్‌వో అనుచితంగా ప్రవర్తించడంతో దుమారం చెలరేగింది. ఈ నెల 8న జిల్లా కేంద్రంలో జరిగిన ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ఈ విషయం వెలుగు చూసింది. అందులో డీఎంహెచ్‌వో తమతో అసభ్యంగా మాట్లాడారని కొందరు మహిళా వైద్యాధికారులు ఆరోపించారు. తర్వాత రోజు వారు కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మొదట ఐదుగురు, ఆ తర్వాత ఇద్దరు మహిళా వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎంహెచ్‌వోపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement