Friday, December 6, 2024

ఉద్యోగ సంఘాల‌ను మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించిన మంత్రుల క‌మిటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పీఆర్సీ ర‌గ‌డ కొన‌సాగుతోంది. హైకోర్టు వ‌ర‌కు వెళ్లంది. అయితే ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఈరోజు మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాల్సిందిగా జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ చేసి ఆహ్వానం అందజేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను శశిభూషణ్ కోరారు. నిన్న కూడా మంత్రుల కమిటీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల కోసం ఎదురు చూసింది. అయితే పీఆర్సీ మీద ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement