Thursday, May 16, 2024

TS | చిల్లర మాటలు, ఉద్దెర పనులు.. కాంగ్రెస్ తీరు దారుణం : కేటీఆర్

అధికారంలోకి వ‌చ్చిన ఈ నాలుగున్న‌ర నెల‌ల కాలంలో చిల్ల‌ర మాట‌లు.. ఉద్దెర ప‌నులు త‌ప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని… ఊస‌ర‌వెల్లి రంగులు మార్చినట్లు రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ… రుణ‌మాఫీ డిసెంబర్ 9వ తేదీలోపు అన్నారని… ఇప్పుడేమో దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నాడని విమ‌ర్శించారు.

నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఆశించింది.. ప్రభుత్వం నుంచి ఏందంటే.. నాలుగు మంచి మాటలు.. ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్లు తెలంగాణ ప్ర‌భుత్వ ప‌తరిస్థితి ఉందిన‌… కేసీఆర్‌కు ఉల్టా పని చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు అని అన్నారు. ఈ ప్రాంతంలో 3వేల కోట్ల ఆర్డర్ల చీరలు ఇచ్చి చేనేతల బతుకులను కేసీఆర్ నిలబెట్టారని, ఇప్పుడు వారు ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్నారని కేటీఇర్ అన్నారు.

పిచ్చివాగుడు కట్టిపెట్టి నేతన్నలకు ఆర్డర్లివ్వాలని డిమాండ్ చేశారు. నేతన్నల ఉసురు త‌గిలే దిక్కుమాలిన రాజకీయాలు బంద్ చేయాలని హితవు పలికారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా చేసి కొన్ని జిల్లాలకు మహానుభావుల పేర్లు పెట్టామని గుర్తు చేశారు. అందులో రాజన్న సిరిసిల్ల ఒకటి అని అన్నారు. అయితే, రేవంత్ రెడ్డి కొన్ని కొత్త జిల్లాలను తీసేస్తాం అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వికేంద్రీకరణ తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాయన్నారు. కొత్త జిల్లాలను కొనసాగించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement