Monday, July 22, 2024

AP | రికార్డు స్థాయిలో సరుకు రవాణా… చరిత్ర తిరగరాసిన విశాఖ

పోర్టువిశాఖపట్నం, ప్రభన్యూస్‌ : సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ పాత రికార్డులను తిరగరాస్తూ మరో నూతన రికార్డును నెలకొల్పింది. 10 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకును కేవలం 45 రోజుల్లోనే రవాణా చేయడం ద్వారా పోర్ట్‌ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్ధాయిలో ఘనత సాధించింది.

గత ఆర్థిక సంవత్సరం 2023-24లో 10 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకును 47 రోజుల్లో చేసిన రవాణాయే ఇప్పటి వరకు రికార్డ్‌గా ఉంది. కానీ ప్రస్తుతం పోర్ట్‌ ఈ రికార్డ్‌ ను తిరగరాసిందని విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు తెలిపారు. ఈ మేరకు ఆయా వివరాలను గురువారం మీడియాకు విడుదల చేశారు.

ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్‌ మేనేజర్‌ జిఆర్‌వి ప్రసాదరావు, సిబ్బందిని పోర్ట్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు ప్రశంసించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో పోర్ట్‌ 90 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల రికార్డ్‌ సరుకు రవాణాను సాధించడంలో కృషి చేయాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement