Tuesday, July 23, 2024

AP | డెంటల్‌ కళాశాల్లో సీనియర్‌ రెసిడెంట్‌… ఖాళీభర్తీకి 28న వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ

అమరావతి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ప్రభుత్వ దంత కళాశాల, ఆసుపత్రిలో పెడోడంటిస్‌ విభాగంలో సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీ భర్తీకి ఈ నెల 28న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ దంత వైద్య కళాశాల, ఆసుపత్రి ఇంచార్జి ప్రిన్సిపాల్ జె.నరేంద్రదేవ్‌ తెలిపారు. ఎండీఎస్‌ ఉత్తీర్ణులైన వారు సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీకి అర్హులని, ఒక సంవత్సర కాలం పాటు పనిచేయవలసి ఉంటుంద‌న్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు http:/gdchvja.in/ వెబ్‌ సైట్‌ను సందర్శించాలన్నారు. 28వ తేదీ ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకూ వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చునని జె. నరేంద్రదేవ్‌ తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement