Monday, July 22, 2024

EC Orders | ఏపీలో ఘర్షణలు.. పలువురు అధికారులపై ఈసీ వేటు

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ ఎన్నికల్లో సీఎస్ డీజీపీల పనితీరుపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు పడింది. వీరందరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ. అలాగే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు సంబంధించిన 12 మంది పోలీసు అధికారులపై వేటు పడింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ అంశంపై దర్యాప్తు చేసి ఒక్కో కేసుకు సంబంధించి తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఈసీ కోరింది. ఫలితాల ప్రకటన తర్వాత జరిగే హింసను నియంత్రించడానికి 25 సిఏపీఎఫ్ కంపెనీలను కౌంటింగ్ తర్వాత 15 రోజులు పాటు కావాలని ఏపీ ప్రభుత్వం అడగగా.. ఈసీ కేంద్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండపై భౌతికంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్, డీజీపీని ఆదేశించింది. దీంతో వారు ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీ పోలీస్ అధికారులపై ఉక్కుపాదం మోపింది ఈసీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement